విజ్ఞాన భాండాగారాలు

Fri,November 15, 2019 01:03 AM

-ప్రతి రోజూ గంటసేపు లైబ్రెరీలోనే గడపాలి
- గ్రంథాలయ వారోత్సవాల్లో ఎమ్మెల్యే బండ్ల
గద్వాల, నమస్తే తెలంగాణ: గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే భాండాగారాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కేఎల్‌ఐ క్యాంపులో గల గ్రంథాలయంలో గురువారం ఎమ్మె ల్యే జాతీయజెండా ఎగురవేసి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయంలో అన్ని రకాల దినపత్రికలతో పాటు పోటీపరీక్షలకు అవసరమైన, వి జ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు అందుబాటులో ఉ న్నాయని వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రతి రోజు కనీసం గంట సేపు గ్రంథాలయంలో గడపటం వల్ల ఎంతో విజ్ఞానా న్ని పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. గ్రంథాలయానికి సరైన వసతులు లేక పాఠకులు ఇబ్బందులు పడేవారని ఇప్పుడు గ్రంథాలయాన్ని కేఎల్‌ఐ క్యాంప్‌నకు మార్చడం వల్ల పాఠకులతో పాటు విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా మారిందన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మె ల్యే హామీ ఇచ్చారు. త్వరలో అన్ని ఆధునిక హంగులతో కొత్త గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం గ్రంథాలయంలో ఎమ్మెల్యే సభ్యత్వం తీసుకున్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడుతూ నేటి నుంచి 20 వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 15వ తేదీన పుస్తక ప్రదర్శన,16న పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 17 న జిల్లా స్థాయి కవి సమ్మేళనం, 18న పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, 19న విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 20న బాలభవన్‌లో ఉదయం 11 గంటలకు గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్ర మం ఉంటుందని ఆ రోజున గ్రంథాలయ వారోత్సవా ల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు జిల్లాలోని విద్యార్థులు అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరా రు. కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయ్‌కుమార్, జెడ్పీటీసీలు ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్, గ్రంథాలయ పాలక వర్గ సభ్యులు రాందేవ్‌రెడ్డి, లక్ష్మి, గ్రంథపాలకుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles