ఆకట్టుకున్నస్టూడెంట్ సైన్స్ విలేజ్ -2019

Fri,November 15, 2019 01:01 AM

అయిజ : పట్టణంలోని బ్రైట్ స్టార్ ఉన్నత పాఠశాలకు చెందిన అటల్ టింకరింగ్ ల్యాబ్ విద్యార్థులు స్టూడెంట్ సైన్స్ విలేజ్ -2019లో భాగంగా పలు శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన ప్రదర్శనలు నిర్వహించారు. గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ -2019లో నేర్చుకున్న విషయాలపై కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు సందర్శించి తిలకించారు. విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్ర, సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకు న్నారు. అయిజ, ఉప్పల, మేడికొండ, తుపత్రాల పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి వచ్చి ప్రదర్శనను చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జేపీ ఎస్తేర్, ఏటీఎల్ ఇన్‌చార్జి దివ్యజ్యోతి తదితరులు ఉన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles