వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

Fri,November 15, 2019 01:00 AM

మల్దకల్: మండలంలోని ఎల్కూర్ గ్రామంలో గురువారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని శివాలయ ప్రాంగణములో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీకమాసంలో భక్తి కార్యక్రమాలను చేపట్టడం శుభసూచకమన్నారు. గ్రామంలో పంటలు బాగా పండి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండేందుకు అనాదిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తోందన్నారు. గ్రామాల్లో ఇలాంటి భక్తి కార్యక్రమాలు చేపట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజల మధ్య ఐకమత్యం వెల్లివిరిసేందుకు దోహదపడుతుందన్నారు.

హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని, దైవంపట్ల ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో గ్రామ బంధుమిత్రులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో ఎక్కడచూసినా పండుగ వాతావరణం నెలకొంది. అంతకుముందు శివాలయంలో భక్తికార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టుతిమ్మప్ప, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ వీరన్న, మాజీ జెడ్పీటీసీ భాస్కర్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి, దివాకర్‌రెడ్డి, ఆంజనేయులు ఉన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles