రైతులు నష్టపోకుండా చూస్తాం

Fri,November 15, 2019 12:59 AM

ఇటిక్యాల: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులు దళారుల చేతిలో మోసపోకుండా మద్దతు ధర కల్పిస్తూ రైతుల నష్టపోకుండా చూస్తామని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని కొండేర్ గ్రామంలో గురువారం ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మేలు చేకూరే విధం గా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోకుండా ప్రభు త్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలుకు నియోజకవర్గంలో ప్రస్తుతం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ము న్ముందు రైతుల నుంచి వచ్చే ధాన్యాన్ని గుర్తించి అవసరాలకు అనుగుణంగా మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ధాన్యమునకు మద్దతు ధర రూ.1835, రూ.1815 గా నిర్ణయించడం జరిగిందన్నారు. రైతులు సరైన తేమతో నాణ్యతను పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలన్నా రు.

జేసీ నిరంజన్ మాట్లాడుతూ జి ల్లాలో ధాన్యం కొ నుగోలు చేసేందు కు గద్వాల నియోజకవర్గంలో 14 కేంద్రాలు, అలంపూర్ నియోజకవర్గంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 20 తేదీ తర్వాత రైతుల నుంచి అధిక మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశముందని భావించి ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. జెడ్పీటీసీ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా సన్నరకాలను సాగుచేయడం జరగిందని ఈ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే, జేసీల దృష్టికి తెచ్చారు. కార్యక్రమం లో సర్పంచ్ వీరన్న, జిల్లా సివిల్ సైప్లెయ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జయచంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయసమితి మండల అధ్యక్షులు గిడ్డారెడ్డి, జిల్లా గ్రంథాలయ సభ్యుడు రాందేవ్‌రెడ్డి, నాయకులు రంగారెడ్డి, శ్రీధర్, సుధాకర్, ఐకేపీ ఉద్యోగులు గ్రామ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles