పదిపై ప్రత్యేక శ్రద్ధ

Wed,November 13, 2019 11:46 PM

-100శాతం ఫలితాలే లక్ష్యం
-ఉదయం,సాయంత్రం ప్రత్యేక తరగతులు
-ఈనెలలో సిలబస్ పూర్తికి చర్యలు
-సబ్జెక్టుల వారీగా ప్రణాళిక
-వెనుకబడ్డ విద్యార్థులపై దృష్టి

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పదోతరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు తగి న చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక త రగతులు నిర్వహిస్తూ వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక మూల్యంకనం ఏ ర్పాటు చేసి వారు ఉత్తమఫలితాలు సా ధించేలా తిర్చిదిద్దుతున్నారు. 2018 లో 76శాతం, 2019లో 86శా తం ఉత్తీర్ణతలు రాగా ఈఏడాది 100 శాతం ఉత్తీర్ణతను సాధించేందుకు తగిన చర్య లు చేపడుత్తున్నారు.

వంద శాతం ఫలితాలే లక్ష్యం

గత రెండేళ్లలో జిల్లాలో విద్యావ్యవస్థలో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై అధికారులు ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రతి విద్యార్ధి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని తగిన చర్యలు చేపడుతున్నారు. 2018 పదోతరగతి ఫలితాల్లో 76శాతం ఉత్తీర్ణతలుకాగా 2019 ఫలితాల్లో 86శాతం మం ది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సంఖ్యను 100శాతానికి పెంచేందుకు విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపడు తున్నారు.

జిల్లాలో 3,200 మంది పదోతరగతి విద్యార్థులు

జిల్లాలోని 485 ప్రభుత్వ పాఠశాలలలు, 13 కస్తూర్బా పాఠశాలలు, 11గురుకులాలు ఉన్నాయి. వీటన్నింటిలో మొత్తం 72,381 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో దాదాపుగా 3,200 మంది విద్యార్థులు పదోతరగతికి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది ఎట్టిపరిస్ధితుల్లోనూ నూటికి నూరుశాతం విద్యార్థుల ఉత్తీర్ణతను సాధించాలని జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తుంది. ఇందుకోసం కలెక్టర్ శశాం క, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,అబ్రహం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రత్యేక స మావేశాలు నిర్వహిస్తున్నారు. వెనకబడిన విద్యార్థులపట్ల చేపట్టాల్సిన జాగ్రత్తలపై పలుమార్పులు సమీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీ గా ప్రత్యేక తరగతులను ఏర్పాటు చే యాలని నిర్ణయించారు.

ప్రత్యేక తరగతులు ఏర్పాటు

పదో తరగతి విద్యార్థులకు ఈ నెలలోనే సిలబస్‌ను పూర్తి చేసేందుకు వి ద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం తరగతులను నిర్వహిస్తున్నారు. ఉదయం సమయంలో 8.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో రోజువారిగా ఒక్కో సబ్జెక్ట్‌ను ఉపాధ్యాయులు బోధిస్తున్నా రు. ఈ నెల చివరి నాటిని సిలబస్‌ను పూర్తిచేసి డిసెంబర్ నెల నుంచి యాక్షన్ ప్లాన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యాక్షన్ ప్లాన్‌లో ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ఉపాధ్యాయులు విద్యార్థులచే ఏదే ని ఒక అంశం పట్ల గంట సమయం పా టు చదివించి వాటిపై అరగంట పాటు టెస్ట్‌లను నిర్వహించనున్నారు. ఇలా ప్ర తి రోజు 3 పరీక్షలను ఏర్పాటు చేస్తారు.

వెనుకబడిన విద్యార్థులపై దృష్టి

చదువులో చురుగ్గాలేని విద్యార్థులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నా రు. వీరి ఉత్తీర్ణత వలనే జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 100శాతం ఫలితా లు వచ్చే అవకాశం ఉండటంతో వీరికో సం తగిన చర్యలు చేపడుతున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా నిష్నాతులైన ఉపాధ్యాయులచే ఇటీవలే విద్యాశాఖ అధికారు లు ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సబ్జెక్ట్‌ల వారీగా ప్రత్యేక మూల్యాంకనం ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. ఈ మూల్యాంకనాన్ని విద్యార్థులకు అందజేసి ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles