రెవెన్యూ వసూళ్లపై కలెక్టర్లు దృష్టి పెట్టండి

Wed,November 13, 2019 11:44 PM

గద్వాల,నమస్తేతెలంగాణ: రాష్ట్రం లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా కేసులు చేసి న రుసుములు అ న్ని జిల్లాల నుంచి సుమారు రూ. 1966కోట్ల రెవె న్యూ వసూళ్లు కా వాల్సి ఉన్నాయని జిల్లా కలెక్టర్లు వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నోటీసులు జారి చేసి రెవెన్యూ వసూలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషీతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 13 ప్రభుత్వ శాఖల ద్వారా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ వారు కేసులు నమోదు చేయడం జరిగిందని వాటిని పరిష్కరించడానికి వారంలో రెండు రోజులు కేటాయిస్తే రెవెన్యూ వసూలు పూర్తి అవుతాయన్నారు. వివిధ స్కీంల కింద వివిధ ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర, కేంద్రం నిధులు కేటాయించడం జరుగుతుందని జిల్లా అధికారులు ఆస్కీంకు సంబంధించి ప్రక్రియ పూర్తి అయినప్పటికి అకౌంట్ సమాప్తం చేయకుండా మిగిలిపోయినా నిధులు సంవత్సరాల తరబడి అలాగే బ్యాంక్ ఖాతాలో మూలుగుతున్నట్లు తాను స్వయంగా పరిశీలించానన్నారు.

ఈ విధంగా వివిధ బ్యాంక్‌ల్లో మిగిలిపోయి మూలుగుతున్న నిధులు కోట్లలో ఉన్నా యని వాటిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లాలో విజిలెన్స్,ఎన్‌ఫోర్స్ మెంట్ కేసులు మొత్తం 6ఉన్నాయని పెనాల్టీతో కలిపి సుమారు రూ.10కోట్ల వరకు రికవరి చేయాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే డిమాండ్ నోటీసులు జారి చేయడం జరిగిందని, రెండో సారి నోటీసులు జారి చేసి సమస్యను పరిష్కరించి రికవరి చేయడం జరుగుతుందని చెప్పారు. నాలాకు సంబంధించి రెవెన్యూశాఖ ద్వారా రికవరి చేయాల్సిన సుమారు రూ.5కోట్లను వెంటనే రికవరి అయ్యే విధంగా చర్యలు ముమ్మరం చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. మైన్స్, లేబర్, కమర్షియల్ టాక్స్‌లకు సంబంధించిన వాటికి రెండో డిమాండ్ నోటీస్‌లు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావుతో పాటు ఎస్‌కేజోషీ, ప్రిన్స్‌పుల్ సెక్రటరీ సోమేశ్వర్‌కుమార్ జిల్లా అధికారులు జేసీ నిరంజన్, ఆర్డీవో రాములు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles