గ్రామీణ క్రీడలను ప్రోత్సహిద్దాం

Wed,November 13, 2019 11:43 PM

గద్వాల,నమస్తేతెలంగాణ (ధరూర్) : గ్రామీణ క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పా రు. బుధవారం ధరూర్ మండలం చింతరేవుల గ్రామంలో కోరుకొండయ్య వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై బండలాగుడు,ఇంటర్ స్టేట్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో పాల్గొనడానికి కర్ణాటక,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి సుమారు 38 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా క్రీ డాకారులను పరిచయం చేసుకుని అ నంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలోఎమ్మెల్యే మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్ర భుత్వం పని చేస్తుందని, వారి సంక్షేమా న్ని దృష్టిలో పెట్టుకుని వారి కోసం రైతు బంధు,రైతు బీమా తదితర పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. ఈ పథకాలు ప్రస్తుతం దేశానికే ఆదర్శంగా నిలిచాయని న్నారు.

ప్రస్తుతం కబడ్డీ లాంటి గ్రామీణ క్రీడలు కనుమరుగు అవుతున్న తరుణం లో గ్రామాల్లో ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయడం వల్ల వాటిని పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. క్రీడల్లో క్రీడాకారులు ఎలాంటి భేషజాలకు పోకుండా స్నేహాపూర్వకంగా ఆట లు ఆడాలన్నారు. ఈ ప్రాంతం నుంచి కబడ్డీ, పుట్‌బాల్ క్రీడాకారులు రాష్ట్ర, అంతర్‌రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చారని చెప్పారు. గద్వాల క్రీడాకారులు ఆటల్లో మంచి ప్రతిభ కనబర్చి గద్వాల పేరు దేశవ్యాప్తంగా వినబడేలా ఆటలు ఆడాలన్నా రు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పు డు ఉంటుందని చెప్పారు. అంతుకు ముందు ఎమ్మెల్యేను, సర్పంచ్ దంపతులతో పాటు గ్రామస్తులు గజ మాల తో ఘనంగా సన్మానించారు.

క్రీడాకారుడుకి ఎమ్మెల్యే అభినందన
గద్వాల రూరల్: మండల పరిధిలోని శెట్టి ఆత్మకూర్ గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు మహేశ్ కుమార్ అండర్-19 కబడ్డీ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అతనినిన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న ఢిల్లీలో జరగబోయే కబడ్డీ పోటీలలో విజయం సాధించి రాష్ర్టానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు శిల్పా ప్రభాకర్‌గౌడ్, శివమణి, ధరూర్ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఉప సర్పం చ్ రాములు, నేతలు నర్సింహారెడ్డి, రఘురెడ్డి, జాకీర్, శ్రీరాములు, రామా ంజనేయులు, ఈశ్వర్ నాయుడు తది తరులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles