సాఫిగా ప్రయాణం

Wed,November 13, 2019 02:23 AM

- పెరుగుతున్న ఆర్టీసీ ఆదాయం
- సోమవారం ఆదాయం రూ. 7.31లక్షలు
- 96శాతం బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
- కొనసాగుతున్న కార్మికుల సమ్మె

గద్వాలటౌన్‌ : డిమాండ్ల పరిష్కారం కోసం ఒక పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్నారు.. మరో పక్క ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లల్లో నడుస్తున్నా యి...అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూ ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో 96శాతం బస్సులు అన్ని రూట్లల్లో విజయవంతంగా నడుస్తున్నాయి...దీంతో ఆర్టీసీకి రోజుకు రోజూకు ఆదాయం రెట్టింపు అవుతుంది.. ఇందుకు సోమవారం ఆర్టీసీకి రూ.7.31లక్షల ఆదాయం సమకూరడమే నిదర్శనం.
జిల్లాలో ఆర్టీసీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. గద్వాల డిపోలో ఉన్న మొత్తం 102ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు 90 నుంచి 96వరకు నడుస్తున్నాయి. అలాగే ప్రతి రోజు 20హైర్‌ బస్సులు నిర్ధేశించిన రూట్లాల్లో నడుస్తున్నాయి. మంగళవారం గద్వాల డిపో నుంచి 96బస్సులను నడిపారు. ప్రయాణికుల రద్ధీకి అనుగుణంగా సమయానుకూలంగా బస్సులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఎక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయా ణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

కొనసాగుతున్న సమ్మె..
డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన సమ్మె యథా విధిగా కొన సాగుతుంది. సమ్మెలో భాగంగా మంగళవారం కార్మికులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో నిరసన చేపట్టారు. సమ్మెకు బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం,బీఎల్‌ఎఫ్‌, టీజేఎస్‌ పార్టీలతో పాటు ప్రజా, కుల, విద్యార్థి, కార్మిక సంఘాలు మద్దతునిచ్చాయి. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులతో పాటు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles