దీపకాంతులు

Wed,November 13, 2019 02:22 AM

గద్వాలటౌన్‌ : కార్తీక పౌర్ణమి పురస్క రించుకుని జిల్లా కేంద్రం గద్వాలలోని కోటలోని ఆలయంతో పాటు ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తులతో నిండిపో యాయి. అభిషేకాలు, అర్చనలతో శివకే శవులను భక్తులు భక్తితో కొలిచారు. అలాగే జిల్లా కేంద్రం సమీపాన ఉన్న కృష్ణానది తీరం తెలవారుజాము 4గంటల నుంచే భక్తులతో కిక్కిరిసి పో యింది. జిల్లా నలుమూలల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. 365, 65 ఒత్తులు ఇలా వారికి మొక్కులను సారంగా దీపాలు వెలిగించి నదిలో వది లారు. అలాగే నదిఒడ్డున ఉన్న స్పటిక లింగేశ్వరస్వామి ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించు కున్నారు. ఉసిరిచెట్టుకు, తులసికోటకు దీపార్చనలు చేసి పునీతులయ్యారు. కృష్ణతీరంలో మరోసారి కృష్ణ మ్మకు పుష్కరాలు వచ్చాయా అన్నట్లుగా భక్తుల కొలాహలం కనువిందు చేసింది.

భక్తిశ్రద్ధలతో తులసి,సత్యనారాయణస్వామి పూజలు..
హిందూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే వ్రతాలలో తులసి వ్రతా నికి ఎంతో ప్రత్యేకత ఉం ది. కార్తీక మాసంలో ద్వాదశినాడు, పౌర్ణమి నాడు ప్రతి ఇంటిలో తులసి మాత వ్రతాన్ని పాటించడం సాంప్ర దాయం. కార్తీక పౌర్ణమిని పుర స్కరిం చుకుని జిల్లా కేంద్రంలో తులసి పూజల ను ప్రజలు భక్తిశ్రద్దలతో నిర్వ హించా రు. ఈ సందర్భంగా కార్తీక దామోదర వివాహన్ని ఘనంగా నిర్వహించారు. తులసి మాతకు ఇష్టమైన నైవేద్యాలను సమర్చించి తమని చల్లంగా చూడాలని వేడుకున్నారు. ప్రత్యేక హారతులు ఇచ్చి తమ ఇష్టదైవాన్ని మహిళలు ప్రార్థించా రు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి స్వామిని వేడుకు న్నారు.

కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు..
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నది అగ్రహారంలో గల ఆలయా లన్నింటిలోను ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సాయంత్రం శ్రీ పూర్ణ నది హారతి సేవా సంఘం ఆధ్వ ర్యంలో కృష్ణమ్మకు నది హారతి నిర్వ హించారు. అంతకుముందు గంగాపూ జను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అ నంతరం కృష్ణమ్మకు వాయనం సమ ర్పించారు. కార్యక్రమంలో జమ్ములమ్మ దేవాలయ ఈవో పురేందర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నింటి లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కోటలోని శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవ ఆల యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని నిర్వ హించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్లకుంట శివాలయం, వీరభద్రేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నందికొల సేవా ఉత్సవాన్ని నిర్వహించారు.

వైభవంగా నదీహరతి -కనుల పండువగా శివపార్వతుల ఊరేగింపు
కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతులను పల్లకిపై ఊరేగించారు. శివపార్వతుల ఊరేగింపు కనుల పండవగా సాగింది. ఊరేగింపు తరువాత శివపా ర్వతులకు నది తీరాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం నదీ హారతిని వైభవంగా నిర్వ హించారు. స్వామి వారిని దర్శించుకు నేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చా రు. అలాగే శ్రీ పూర్ణ నది హారతీ సేవా సంఘం ఆధ్వర్యంలో నది హారతి నిర్వ హించారు. ఈ సందర్భంగా భక్తులు నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లిం చు కున్నారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే..
కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొ ని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద ర్భంగా కృష్ణమ్మకు గంగాపూజ, అభిషే కాలు నిర్వహించారు. అలాగే స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నది హారతిలో పాల్గొని పూ జలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సరోజమ్మ, ఎంపీపీలు ప్రతా ప్‌గౌడ్‌,విజయ్‌, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles