రైతులు, రెవెన్యూ సిబ్బంది మధ్య వాగ్వివాదం

Tue,November 12, 2019 02:58 AM

-పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన సమస్య
గద్వాల, నమస్తే తెలంగాణ: కలెక్టరేట్ ఆవరణలో రైతులు, రెవెన్యూ సిబ్బంది మధ్య సోమవారం వాగ్వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన రైతు తమ సమస్య చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. గట్టు రెవెన్యూ అధికారులు తన సమస్య పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సోమవారం ప్రజావాణిలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో అక్కడ ఉన్న పాత్రికేయులతో తన గోడును వెళ్లబోసుకుంటూ రెవెన్యూ అధికారులను దూశిస్తూ మాట్లాడాడు. గత కొన్ని రోజులుగా రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి అక్కడే అందోళన చేస్తున్నారు. రెవెన్యూ అధికారులను రైతు దూషించడంతో వారు కూడా రైతులను దూషించడం మొదలు పెట్టారు. బాధిత రైతుకు మరికొంత మంది రైతులు తోడై మీరు లంచగొండులు.. మీరు మా పనులు సక్రమంగా చేస్తే ఈ పరిస్థితి మాకు వచ్చేది కాదు.. డబ్బులు తీసుకుని పనులు చేయడం లేదని ఆరోపణలు చేస్తూ రెవెన్యూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఒక తాసిల్దార్ చనిపోతే నాలుగు రోజులు పనులు బంద్ పెడతారు.. అదే మీ రెవెన్యూ ఉద్యోగుల వల్ల రైతులు చనిపోతే ఎందుకు స్పందించరు అంటూ అధికారులను రైతులు నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తమవడంతో అక్కడే ఉన్న పోలీసులు రైతులు, రెవెన్యూ సిబ్బందిని సముదాయించి పంపించడంతో సమస్య సద్దు మణిగింది.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles