పుట్టిన ఊరు.. చదివిన బడిని మరువొద్దు

Sun,November 10, 2019 12:34 AM

బిజినేపల్లి : విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని సెక్రెటరీ ఆఫ్ టీడబ్ల్యూఆర్‌ఐఈఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని వట్టెం గ్రామంలోని జవహార్ నవోదయ విద్యాలయంలో జరిగిన రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పుట్టిన ఊరు, చదివిన విద్యా సంస్థలను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలన్నారు. సమాజ సేవలో విద్యార్థులు పాలు పంచుకోవాలన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ను ఒక ప్రణాళిక బద్దంగా తయారు చేసుకొని తీర్చి దిద్దుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో పోటీ పడి చదవాలన్నారు. ఈ నవోదయ విద్యాలయాల్లో సీటు లభించి ఇక్కడ చదువుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. అనంతరం బల్‌రాం మాట్లాడుతూ... పేదరికంలో పుట్టి గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియంలో చదివి ఇంటర్ తర్వాత దూర విద్య తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ స్థాయికి చేరడం జరిగిందన్నారు. ఆలయ ధర్మకర్త రంగారెడ్డి మాట్లాడుతూ నాటి ఎంపీ మల్లురవి కృషితో నెలకొల్పిన ఈ నవోదయ విద్యాలయం పాతికేళ్ల ప్రయాణంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రశంసించే స్థాయికి ఎదగాలన్నారు.

ఏవైరెడ్డి మాట్లాడుతూ... ఈ జిల్లాకు చెందిన నేను ఈ ప్రాంతంలో ఉన్న ఈ నవోదయ విద్యాలయ రజతోత్సవాలకు హాజరు కావడం ఎంతో గర్వ దాయకం. నవోదయ జీవితం ఖచ్చితంగా బంగారు భవిష్యత్ అన్నారు. డిప్యూటీ కమిషనర్ అనసూయ మాట్లాడుతూ... ఈ నవోదయ విద్యాలయంలో నేను టీచర్‌గా పని చేసి డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరుకున్నానన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీర రాఘవయ్య, దామోదర్‌రెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఏవైరెడ్డి, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ అనసూయ, ఆలయ చైర్మన్ సందడి రంగారెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ మురళికృష్ణ, కో కన్వీనర్ పరమేశ్, అధ్యక్షులు రంజిత్‌కుమార్, పూర్వ విద్యార్థులు శశాంక్, ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని కేజీబీవీ ఉద్యోగుల నిరసన
అయిజ: తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కేంద్ర ప్ర భుత్వం 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కనీ స వేతనం రూ. 18 వేలు నిర్ణయించినందున ఆ జీ వోను ప్రభుత్వం అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ కోరారు. శనివారం పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ కార్డుల జారీచేసి నగదు రహిత వైద్యం అందించాలన్నారు. విధి నిర్వహణలో గాయపడినా, మరణించినా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల్లోని రెగ్యులర్ మహిళా ఉపాధ్యాయులు, ఉగ్యోగులకు వర్తించే ప్రసూతి సెలవు, శిశు సంరక్షణ సెలవులతో సహా అన్ని రకాల సెలవులను వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో టీఎస్ యుటీఎఫ్ మండల ప్రధాన కార్య దర్శి లక్ష్మన్, కేజీబీవీ ఎస్‌వో కృష్ణవేణి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొ న్నారు.

వడ్డేపల్లిలో..
వడ్డేపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వడ్డేపల్లి, రాజోళి మండల ఉపాధ్యాయులు భోజన విరామ సమయం లో కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపా రు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తిప్పన్న, ఉపాధ్యాయులు కుమార్ నా యుడు, లక్ష్మ న్న, బీస న్న, భీమన్న, తిలక్‌లు పా ల్గొన్నారు. సమాన పనికి సమాన వేతం చెల్లించాలని, 10వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, మెటర్నిటీ సెలవులు వేతనంతో ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
అలంపూర్, నమస్తే తెలంగాణ : సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ని కేజీబీవీ వద్ద ఉద్యోగులతో కలిసి భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు మంజూరు చేయాలని, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కేజీబీవీ ఉద్యోగులను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో కేజీబీవీ ఉద్యోగులు,టీఎస్ యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్, రమేశ్, నాగరాజు, బషీర్, మాబుసాబ్ తదితరులు పాల్గొన్నారు.


63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles