రమణీయం.. కట్టకింద తిమ్మప్ప రథోత్సవం

Sun,November 10, 2019 12:30 AM

అయిజ: . పట్టణానికి సమీపంలోని కట్టకింద తిమ్మప్ప (వేంకటేశ్వర) స్వామి రథోత్సవం రమణీయంగా జరిగింది. కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 11 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి సర్వాంగ సుందరంగా అలంకరించిన చిన్న రథంపై ఆశీనులై భక్తులను అనుగ్రహించారు. మమ్మేలగ వచ్చితివా శ్రీనివాసా .. నీకు వేవేల ప్రణామాలు అంటూ స్వామివారి దివ్యమనోహర రూపాన్ని దర్శించి భక్తులు తన్మయత్వం చెందారు. భాజా భజంత్రీలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ దేవదేవుడు ఆలయ ప్రాంగణంలో రథంపై ఊరేగాడు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కట్టకింద తిమ్మప్పస్వామి ఆలయంలో శ్రీవారి ఉత్సవాలను కనుల పండువగా జరుపుతున్నారు. శనివారం స్వామివారికి అభిషే కం, అలంకరణ చేసిఅర్చనలు చేశారు.

ధన్వంతరి వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు
మండలంలోని ఉత్తనూరు గ్రామంలో వెలసిన ధన్వంతరి వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంను పురస్కరించుకుని శనివారం తెల్లవారు జామున స్వామి సుప్రభాత సేవ, అలభిషేకం, అలంకరణ చేసి పూజ లు చేశారు. అనంతరం భక్తులకు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కల్పించారు. ధన్వంతరి వేంకటేశ్వరస్వామిని కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles