హోరెత్తించిన మెడికోలు

Sat,November 9, 2019 05:39 AM

-డ్యాన్స్‌లతో హోరెత్తించిన మెడికోలు
-ఉల్లాసంగా ఉత్సాహంగా మెడికల్ కాలేజీ వార్షికోత్సవం
-జ్యోతి వెలిగించి ప్రారంభించిన పాలమూరు కలెక్టర్ రోస్
-విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచన
-క్రమ శిక్షణతో మెలగాలన్న కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్


మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) : వైద్య వి ద్యార్థులుగా చదువుతో పాటు తమలో ఉన్న కళ లు, ఇతర నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సూచించా రు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎదిరలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఒలంపిక్ జ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలకు చెందిన నాలుగు బ్యాచ్‌ల వైద్య విద్యార్థులు కవాతు చేశారు. వైద్య

విద్యార్థులు భ రతనాట్యం, నృత్యాలతో అలరించారు. అనంత రం కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విద్యతో పాటు ప్ర జలకు వైద్యసేవలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. ఎంత ఒత్తిడికి గురైనా క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఆటల ద్వారా ఒత్తిడికి దూరమై పరీక్షలలో ఉత్సాహంతో పాటు ఉత్తేజం పెరుగుతుందన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న వేడుకల్లో అన్ని బ్యాచుల విద్యార్థులు కలిసికట్టుగా పాల్గొని ఒకే కుటుంబం అనే స్ఫూర్తి తో ఉండాలన్నారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్ట ర్ పుట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య విద్యార్థు లు క్రమశిక్షణతోపాటు ఆటల పోటీల్లో తమ ప్రతిభను కనబర్చాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాం కిషన్, వైస్ ప్రిన్సిపాల్ సునందిని, అకాడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పార్వతి, హెచ్‌వోడీ డాక్టర్ నా వల్
కిశోర్, డాక్టర్ కిరణ్‌ప్రకాశ్, బోధన, బోధనేతర సిబ్బంది, 600 మంది విద్యార్థులున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles