చదివిన బడిని మరవొద్దు

Sat,November 9, 2019 05:36 AM

బిజినేపల్లి : ఉన్నత శిఖరాలను అధిరోహించినా చ దివిన పాఠశాలను, పుట్టిన గ్రామాన్ని ఎప్పటికీ మరవొద్దని నవోదయ విద్యాల యం ప్రిన్సిపాల్ వీర రా ఘవయ్య అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జి ల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం గ్రామంలో న వోదయ విద్యాలయం ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ వి ద్యార్థులు రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మా ట్లాడుతూ నవోదయ విద్య చదివిన ప్రతి విద్యార్థి అత్యుత్తమంగా సెటిల్ అయ్యారని తెలిపారు. సెంట్రల్ సిలబస్ ద్వారా విద్యాబోధన చేస్తున్నట్లు వివరించారు.

ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి హోదాలో ఉన్నారన్నారు. చదువుకున్న పాఠశాలను మరువకుండా రజతోత్సవ వేడుకలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. పట్టుదలతో చదివితే లక్ష్యాలను చేరుకోవచ్చని, ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే సాధించలేనిదేది ఏదీ లేదన్నారు. ఒకే చోట ఇన్ని సంవత్సరాల విద్యార్థులు చేరి రజతోత్సవ కా ర్యక్రమాన్ని ఉత్సవంలా నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం పా ఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, ఆనాటి విద్యార్థులు నిర్వహించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు ఉన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles