గుప్పుమంటున్న గంజాయి

Fri,November 8, 2019 01:05 AM

-ఏటా పట్టుబడుతున్న పంట
-ఈడిగోనిపల్లిలో 24మొక్కలు
-కలకలం రేపిన ఎక్సైజ్ అధికారుల దాడులు
-గతేడాది చెన్గోనిపల్లిలో 30 మొక్కల గుర్తింపు
-మిర్చిలో అంతరపంటగా సాగు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో గంజాయిసాగు ఆందోళన కలిగిస్తుంది. రెండేళ్ల నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో గంజాయి పంటను రైతులు సా గు చేస్తున్నారు. అధికలాభాలు పొందవచ్చనే ఆశతో రైతులు చట్టపరంగా చే పట్టే చర్యలు తెలియక గంజాయి పంటలను సాగుచేస్తున్నారు. ఈ పంట సాగువలన కలిగే అనర్థాలపై అవగాహన లేకపోవడం, ఎక్కువ లాభాలు పొందవచ్చని అపోహపడంతో రైతులు ఈ ఊబిలోకి దిగుతున్నారు. పోలీసు, ఆబ్కారీశాఖ దాడుల్లో చిక్కడంతో గంజాయిని సాగుచేస్తున్న రైతులు జైలు పాలవుతున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు ఈ పంటను సాగు చేయడాన్ని ఎక్కువగా గమనించవచ్చు.

రెండేళ్లుగా పట్టుబడుతున్న గంజాయి
నడిగడ్డలో రెండేళ్లుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో గంజాయి పంట లు పట్టుబడుతున్నాయి. గతేడాది గద్వాల మండలం చెన్గోనిపల్లిలో ఓరైతు పొలంలో ఆబ్కారీశాఖ అధికారులు 30 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. మిర్చిపంటలో అంతరపంట గా సాగుచేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి వాటిని పంట నుంచి తొలగిం చి అక్కడిక్కడే ధ్వంసం చేశారు. రైతుపై కేసునమోదు చేసి జైలుకు పంపించిన సంఘటనలు కూడా జరిగాయి. సరిగ్గా ఏడాది తరువాత గురువారం అయిజ మండలం ఈడిగోనిపల్లి గ్రామంలో 24 మొక్కలను పోలీసులు గుర్తించి స్వా ధీనం చేసున్నారు. గ్రామంలోని నలుగురు రైతులు తమ పొలంలోని మిర్చిపంటలో అంతర పంటగా గంజాయిని సాగుచేస్తున్నారు. పక్కా సమాచారం మేరకు పంటలపై దాడులు చేసిన పోలీసులు గంజాయి మొక్కలను గుర్తించా రు. ఒక కుంట భూమిలో మిర్చి మొ క్కల మధ్యలో అక్కడక్కడా రెండు మూడు మొక్కలను మాత్రమే రైతులు గంజాయి మొక్కలను విడివిడిగా సాగుచేశారు. వీటిని గుర్తించిన పోలీసులు వాటిని తొలగించి ధ్వంసం చేసి రైతుల ను అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటక నుంచి విత్తనాల సరఫరా
కర్ణాటకలో బ్లాక్ మార్కెట్ నడిపించే కొందమంది దళారులు తెలంగాణ సరిహద్దు రైతులను ఎంచుకొని ఈ దందా నడిపిస్తున్నారు. రైతులకు డబ్బును ఆశచూపి రైతులను ఈ ఊబిలోకి దించుతున్నారు. గంజాయి విత్తనాలను వాటిసాగుకు కావల్సి పంట ఎరువులను అం దించి గుట్టుచప్పుడుకాకుండా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. రహదా రులకు దూరంగా భూములు ఉండే సరిహద్దు రైతులచే ఈ పంటలను సాగుచేయి స్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో గం జాయి ఆకులు కిలో రూ.5నుంచి 6వేల వరకు ధర పలుకుతుండటంతో లక్షలు సంపాందించవచ్చనే అత్యాశతో రైతులు గంజాయిని సాగుచేసేందుకు ముందు కు వస్తున్నారు. కొందరు రైతులు పశువుల దాణాలో గంజాయి ఆకులను మే తగా వేస్తే పశులు మేత ఎక్కువగా మేసి బలంగా తయారవు తాయన్న అపోహతో అక్కడక్కడా పొలంలో గంజా యి మొక్కలను సాగుచేస్తున్నారు. రెం డు నుంచి మూడు నెలల్లోనే పంటచేతికి వస్తుండటం అధికంగా లాభాలు గడిం చడంతో రైతులు ఈ ఊబిలోకి దిగుతున్నారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తే మరిన్ని గంజాయి సాగు పంటలు పట్టుబడే అవకాశాలున్నాయి. గంజా యి సాగువలనే క లిగే అనర్థాల గురిం చి, వాటి వలన అ నుభవించే శిక్షల గు రించి వివరించి అవగాహనలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

3నుంచి 12ఏండ్ల్ల వరకు జైలుశిక్ష
గంజాయి సాగులో పట్టుబడిన వ్యక్తులకు కోర్టులు కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. గంజాయి, అల్ఫాజోలం, డైజోఫాం, నల్లమందు, కొకైన్, హెరైన్ వంటి మాదక ద్రవ్యాలతో పట్టబడితే నిందితులకు 3 నుంచి 12 ఏండ్ల్ల వరకు శిక్షలు పడే అవకాశాలు న్నాయి. మాదకద్రవ్యాలు పట్టుబడినప్పుడు 3 రకాలుగా కేసులు నమోదు చేస్తారు. లో క్వాంటిటీ లెవల్, క్వాంటిటీ లెవల్, హై క్వాంటీటి లెవల్ ఇలా మూడు రకాలు గా గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను అధికారులు విభజిస్తారు. లో క్వాంటిటీ లెవల్‌లో పట్టుబడితే 3ఏళ్ల జైలుశిక్ష, క్వాంటిటీ లెవల్‌లో పట్టుబడితే 7ఏళ్ల వరకు జైలుశిక్ష, హై క్వాంటిటీతో పట్టుబడితే 12ఏళ్ల వరకు జైలు శిక్షలుపడే అవకాశాలున్నాయి.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles