సమగ్ర సస్యరక్షణ చేపట్టాలి

Fri,November 8, 2019 01:03 AM

ఇటిక్యాల: మిరపపంట సాగుచేసిన రైతులు సమగ్రసస్యరక్షణ చేపట్టాలని మదనాపురం కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త సురేశ్ సూచించారు.మండలంలోని వేముల, మునుగాల గ్రామాల పరిధిలో సాగుచేసిన మిరప పంటలను గురువారం ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం మిరపపంటలో తెల్లదోమ, నల్లి తాకిడి అధికంగా ఉందన్నారు. వీటి ఉధృతిని రైతులు సకాలంలో గుర్తించి నివారించకుంటే ప్రధానపంటకు వైరస్‌సోకి తీవ్రనష్టం కలిగే అవకాశముందని తెలిపారు. అందుకని రైతులు వీటి నివారణకు గాను పిఫ్రోనిల్ 400ఎంఎల్, ఇమిడాక్లోప్రిడ్ 80ఎంఎల్, ప్రైడ్ 50గ్రాములు, అక్టారా, 60ఎంఎల్, మందులను మార్చి,మార్చి ప్రధానపైరుపై పిచికారి చేయాలన్నారు. అలాగే పంటపొలంలోని మొక్కలకు పైముడత లక్షణాలు అగుపిస్తే దీని నివారణకు గాను పెగాసిస్ 300గ్రాములు, ఇంటర్పిడ్ 400ఎంఎల్, ఎకరా పంటపై మూడునాలుగు రోజుల వ్యవధిలో పిచికారి చేయాలన్నారు.

కాయకుళ్లు తెగులు నివారణకు గాను ప్రొపికొనజోల్ 200ఎంఎల్, డైపెన్కోజోల్ 100ఎంఎల్, మందులను పిచికారి చేయాలన్నారు. మంచు కురిసే సమయంలో మిరపపంటకు అధికంగా నష్టపరిచే బూడిద తెగులు నివారణకు గాను రైతులు ఇండెక్స్ అనే మందు ఎకరాకు 200 గ్రాములు అలాగే కాంటాఫ్ 300ఎంఎల్ మందులను మార్చి మార్చి పిచికారి చేయాలన్నారు. రైతులు ప్రతిరోజు పంట పొలాన్ని పరిశీలిస్తూ పంటలో ఏ తెగుళ్లు పురుగులు ఉన్నాయో వాటి ఉధృతి ఏవిధంగా ఉందని ఎప్పటికప్పుడు పరిశీ లించి అప్రమత్తంగా ఉంటూ తెగుళ్లను పురుగులను అదుపులో ఉంచుకొనేందకు తగు విధంగా చర్యలు చేపడితే మంచిదిగుబడులు సాధించే అవకాశముందన్నారు. అలాగే తెగుళ్లను గుర్తించినపుడు గుడ్డిగా రకరకాల మందులను వాడకుండా నిపుణుల సలహాలను పాటిస్తూ సాగుఖర్చును తగ్గించుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి జయరాజ్, ఉద్యా నవన అధికారులు సురేశ్, రాజశేఖర్, శ్రీనివాసాచారి, హెచ్‌వో ప్రసాద్ ఆత్మ ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్, శ్రీధర్ పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles