ప్రతి జీపీలో వైకుంఠధామం నిర్మించాలి

Fri,November 8, 2019 01:02 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టాలని శిక్షణ కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. అలంపూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డులు, నర్సరీ పెంపకం పనులు చేపట్టాలన్నారు. అలాగే ప్రతి ఇంటికీ ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రతి పంచాయతీ కార్యాలయానికి మరుగుదొడ్డి నిర్మించాలని, ఈ పనులు వేగవంతంగా చేయాలని శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రతి జీపీకి రూ.పది లక్షల నిధులు కేటాయించబడ్డాయని, ఉపాధి హామీ పథకం అనుసంధానంతో వైకుంఠధామాలు నిర్మించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి ఏపీవో విజయశంకర్, ఎంపీవో చంద్రకళ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ..
మానవపాడు : మోడల్ అంగన్‌వాడీ సెంటర్ల ఏర్పాటు కోసం మండల కేంద్రంలోని ఉర్దూ పాఠశాలలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌ను ట్రైనీ కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. మానవపాడు ప్రాజెక్టు పరిధిలోని ఆరు మండలాల్లో మండలానికి రెండు సెంటర్ల చొప్పున మొత్తం 12 సెంటర్లు పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా గురువారం స్థానిక ఉర్దూ పాఠశాలలో ఉన్నటువంటి అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ సెంటర్‌కు కావాల్సిన మౌలిక సదుపాయాలు, కలరింగ్, వాల్ పెయింట్ వేయడం, ఆటవస్తువులు ఏర్పాటుచేయడం వంటివి ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీడీపీవో సురిమిల, సూపర్‌వైజర్లు ఆశ్మ, సంధ్య పాల్గొన్నారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles