సీఎమ్మారెఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే అబ్రహం

Mon,October 21, 2019 12:46 AM

ఉండవెల్లి : అలంపూర్ చౌరస్తాలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం బాధిత కుటుంబాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అబ్రహం వారికి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గ ప్రజలను పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలని కార్పొరేట్ వైద్యం అందించి అందుకయ్యే ఖర్చును సీఎం సహాయ నిధి నుంచి అందించడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి చెక్కులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చెక్కులు అందుకున్నవారిలో మద్దిలేటి రూ.60వేలు చండూరు, బుడ్డన్న రూ.15వేలు జులకల్, శివ రూ.20వేలు ఉండవెల్లి, వెంకటలక్ష్మి రూ.60వేలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles