విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

Mon,October 21, 2019 12:45 AM

-గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
రాజాపూర్ : మహానుభావులు అందించిన విజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని గురుకులాల రాష్ట్ర కార్యద ర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఐఆర్‌ఎస్ అధికారి బాల్‌రాంనాయక్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. అ లాగే, మోతీ ఘణపూర్, నేరళ్లపల్లి, చింతకుంట తండా, ఊటకుంట తండాలలో స్వై రోస్ విజ్ఞాన మందిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోపాటు, మహానుభావుల జీవిత చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. మనం చదువుకుంటేనే తమ తోటి వారికి విజ్ఞానం అందించాలన్నారు. దీనివల్ల సమాజంలోని అందరూ విజ్ఞానవంతులై దేశ నవ నిర్మాణంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎంపీ నాయకుడు దాసురాం నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, స్వైరోస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles