రూ.10కోట్ల నిధుల వినియోగంపై సీడీఎంఏ అధికారుల పరిశీలన

Sat,October 19, 2019 01:53 AM

అలంపూర్,నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం అలంపూరు నియోజకవర్గంలోని కొత్త మున్పిపాలిటీలకు ఒక్కో మున్సిపాలిటీకి పది కోట్లు నిధులు ప్రభుత్వం నుంచి అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం మంజూరు చేయించిన విషయం విధితమే. అందుకు గాను శుక్రవారం సీడీఎంఏ శ్రీదేవి ఆదేశాల మేరకు సీడీఎంఏ హై దరాబాద్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు అలంపూరు మున్సిపాలిటీలో పర్యటించారు. పట్టణంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై స్థానిక అధికారులతో చర్చించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అందులో భాగంగా పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి వసతులు, పార్కింగ్ ఏర్పాటు, శానిటేషన్, డంపింగ్ యార్డుల ఏర్పాటు తదితర వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటీవ్ డిప్యూటీ డైరెక్టర్ పాల్గున్, కమిషనర్ వెంకటేశ్వర్లు, అలంపూరు మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్ తాసిల్దార్ తిరుపతయ్య, ఏఈ చంద్ర శేఖర్, మేనేజర్, గణేశ్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles