జోగుళాంబ ఆలయంలో చండీహోమం

Sat,October 19, 2019 01:53 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : శుక్రవారం ప్రత్యేక రోజును పురస్కరించుకొని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వా మి ఆలయాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న పట్టణంలోని జోగుళాం బ ఆలయంలో శుక్రవారం ఉదయం చం డీహోమంతో పాటు సంధ్యావేళ రథోత్స వం నిర్వహించారు. జోగుళాంబ ఆలయంలో అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు అర్చకులు వారోత్సవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి బంగారు ఆభరణాలతో అలంకరించారు. త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు మొదలగు పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయాన జోగుళాంబ ఆలయంలో రథోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. జోగులాంబ దేవి రథంను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం ఏపీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles