మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి లకు బండారి భాస్కర్ కృతజ్ఞతలు

Sat,October 19, 2019 01:53 AM

గద్వాల రూరల్: రాష్ట్ర పంచాయతీ ట్రిబ్యునల్‌లో సభ్యుడిగా తన ఎన్నికకు సహకరించిన మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్‌ను బండారి భాస్కర్ శుక్రవారం కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండారి భాస్కర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మంత్రి కేటీఆర్ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతుడిగా ఉంటానని అన్నారు. బండారి భాస్కర్ ఈ రోజు జన్మదినం కావడంతో మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని వారి కార్యాలయంలో భాస్కర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ సరిత బండారి భాస్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles