చిన్నోనిపల్లి సమస్యలు కలెక్టర్‌కు నివేదిస్తా

Fri,October 18, 2019 01:13 AM

గట్టు : చిన్నోనిపల్లి పునరావాస కేంద్ర సమస్యలు కలెక్టర్‌కు నివేదిస్తానని ఆర్డీవో రాములు పేర్కొన్నారు. పునరావాస కేంద్రాన్ని ఆర్డీవో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలోని సమస్యలను ఎంపీపీ విజయ్‌కుమార్, నిర్వాసితులు ఆర్డీవోకు వివరించారు. అక్కడి నుంచి బోయలగూడెం, భూంపురంకు లింక్ రోడ్ల ఆవశ్యకతను ఎంపీపీ ఆర్డీవోకు వివరించారు. ఈ రోడ్ల గురించి కలెక్టర్‌కు ఇదివరకే వినతిపత్రాన్ని ఇచ్చిన విషయాన్ని ఎంపీపీ గుర్తుచేశారు. గ్రామ పంచాయతీకి నూతన భవనం మంజూరు చేయాలని కోరారు. పునరావాస కేంద్రంలోని సమస్యలతో నిర్వాసితులు చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ విజయ్‌కుమార్ ఆర్డీవో రాములును అభ్యర్థించారు. పునరావాస కేంద్రంలోని పలు ప్రాంతాల్లో కారు వెళ్లడానికి వీలులేకపోవడంతో ఎంపీపీ ఆర్డీవోను మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని ఆ ప్రాంతం మొత్తం పరిశీలించారు. ఆర్డీవో వెంట తాసిల్దార్ నరేందర్, ఆర్‌ఐ నాగిరెడ్డి, వీఆర్‌వో రంగన్న, ఇరిగేషన్ అధికారులు, స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles