షాపుల ముందున్న షెడ్లు తొలిగించండి

Fri,October 18, 2019 01:13 AM

గద్వాల క్రైం : గద్వాలలోని ప్రధాన రోడ్లకు ఇరువైపుల షాపుల ముందున్న షెడ్లను తొలగించాలని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు టౌన్ పోలీసులను ఆదేశించారు. గద్వాలలోని పాతబస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్ పాయింట్లను, అక్కడి సమస్యలను గురువారం ఏఎస్పీ కృష్ణతో కలిసి ఆమె పరిశీలించారు. తరచు ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు అక్కడి ప్రజల ద్వారా ఆమె తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రోడ్డు మధ్యలో అక్కడక్కడ డ్రైనేజీ కాల్వలకు సంబంధించిన గుంతలతో ప్రమాదం ఉందని, మున్సిపాలిటీ అధికారులకు విషయాన్ని తెలియజేసి రోడ్డుకు సమానంగా ఉండేటట్లు చూడాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ముందుగా అక్రమంగా వేసుకున్న షెడ్లను తొలగించేందుకు చర్యలు ముమ్మరం చేయాలని ఇన్‌చార్జి ఎస్పీ మున్సిపల్ కమిషనర్ నర్సింహులు, టౌన్ ఎస్సై సత్యనారాయణలను ఆదేశించారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles