గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయండి

Fri,October 18, 2019 01:13 AM

-కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే బీకేఎంఆర్
గద్వాల న్యూటౌన్ : గద్వాల నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని కలెక్టర్ శశాంక, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలు పేర్కొన్నారు. గద్వాలలోని కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎమ్మెల్యేలు ఎంపీడీవోలు, సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులతో గురువారం రాత్రి ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 15 గ్రామాలను ఎంపిక చేసి ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. పూర్తి కార్యచరణతో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకునేలా అందరూ కృషి చేయాలన్నారు. అధికారులు తప్పనిసరిగా సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో గద్వాల మండల పరిషత్ అధ్యక్షడు ప్రతాప్‌గౌడ్, గట్టు మండల పరిషత్ అధ్యక్షుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles