రైతులు నకిలీ విత్తనాలు కొనొద్దు

Thu,October 17, 2019 01:24 AM

ఇటిక్యాల: రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని ఎమ్మెల్యే అబ్రహం సూచించారు. మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో గల పుటాన్‌దొడ్డి వ్యవసాయ సహకార సంఘంలో బుధవారం ఎమ్మెల్యే సబ్సిడీ పప్పుశెనగ విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను రైతులకు అందజేస్తుందని అన్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని రైతులు బహిరంగ మార్కెట్‌లో నకిలీ విత్తనాలు కొని నష్టపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వారి శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని పరపతి సంఘం సీఈవో శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలోమండల వ్యవసాయ అధికారి అయూబ్, సర్పంచ్ రవి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గిడ్డారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు జయచంద్రారెడ్డి, సర్పంచులు రవీందర్, వీరన్న, మల్లన్న, టీఆర్‌ఎస్ నాయకులు ఏఈవోలు, పరపతి సంఘం సిబ్బంది పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే రైతు రాజ్యం
రాజోళి: కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రైతు రాజ్యం వచ్చిందని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. రాజోళిలోని ప్రాథమిక సహకార సంఘ కార్యాలయం వద్ద సబ్సిడీపై పప్పు శనగ విత్తనాలను ఎమ్మెల్యే రైతులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, జెడ్పీటీసీ సుగుణమ్మ, సీతారామిరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, ఎంపీపీ మరియమ్మ నతానియల్, కో-ఆప్షన్ సభ్యులు నిషాక్, ఎంపీటీసీ మన్సూర్, పడమటి గార్లపాడ్ సర్పంచ్ భూషణం, పీఏసీఎస్ అధ్యక్షుడు సోమన్న, మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, ఏఈవో ధీరజ్, రైతులు పాల్గొన్నారు

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles