మద్యం టెండర్లకు నేడే ఆఖరు u పోటీ పడుతున్న మహిళలు

Wed,October 16, 2019 01:30 AM

మహబూబ్‌నగర్ క్రైం: మద్యం టెండర్లలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు పోటీ పడుతున్నారు. అందులో మహిళలు మద్యం టెండర్ల కోసం ప్రతిరోజు ఆబ్కారి శాఖలో దరఖాస్తులు వేయడానికి పోటీ పడుతున్నారు. మద్యం టెండర్లు ప్రారంభమై నేటికి 5 రోజులు పూర్తి కావడంతో ఈ ఐదురోజుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 164 దుకాణాలకు 1276 దరఖాస్తులు వచ్చాయని ఉమ్మడి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయసేనారెడ్డి తెలిపారు. మద్యం టెండర్లలో దుకాణాలను చేజిక్కించుకునేందుకు చివరి గడువు తేదీ రావడంతో దరఖాస్తుదారులు టెండర్లు వేసేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు వ్యాపారులు వారితో కూడా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పేర్లతో టెండర్లు వేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని మద్యం దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల ఎక్సైజ్ శాఖ పరిధిలో 271 టెండర్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 210 టెండర్లు, గద్వాల జిల్లాలో 74 టెండర్లు, వనపర్తి జిల్లాలో 54 టెండర్లు మద్యం దుకాణాల కోసం వేశారు. మంగళవారం ఒకేరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 604 దరఖాస్తులు వచ్చాయి. నేడు బుధవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున టెండర్లు వస్తాయని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు టెండరు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించారు. చివరిరోజు అత్యధిక సంఖ్యలో టెండర్లు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.

పోటీలో మహిళలే ఎక్కువ
మద్యం దుకాణాల కోసం మహిళలు ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో పోటీ పడుతుండడంతో ఎక్సైజ్ అధికారులు ఖంగుతిన్నారు. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలో డిమాండ్ ఉన్న ప్రతి దుకాణానికి వారి కుటుంబ సభ్యులు ఇంటి మహాలక్ష్మీ అని మహిళలతో మద్యం దుకాణాల కోసం టెండర్లు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు మహిళలు పెద్ద సంఖ్యలో 30 మంది వరకు టెండర్లు వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

టెండర్లకు నేడే చివరి రోజు
మద్యం టెండర్లకు నేడు చివరి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంతమంది టెండర్లు వేయడానికి వస్తారో అంతమందికి టెండరు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు. చివరి రోజు బుధవారం మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో టెండర్లు వేస్తారని ఎక్సైజ్ అధికారులు అన్ని టెండరు కేంద్రాలలో చర్యలు తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెండర్లు వేసేందుకు దృష్టి సారించారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles