రద్దీకి అనుగుణంగా బస్సులు

Wed,October 16, 2019 01:30 AM

గద్వాలటౌన్ : వివిధ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేప ట్టిం ది. కార్మికులు విధులను బహిష్కరించి 11రోజులయ్యాయి. సమ్మె కార ణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుకు గా ను తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్ల ని యామకం చేపట్టి వారి ద్వారా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను ప్రభుత్వం కొ నసాగిస్తుంది. రోజు రోజుకు ప్రయాణికులు రాకపోకలు ఎక్కువ వుతున్నా యి. దీంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడు పు తుంది. మంగళవారం ప్రయాణికుల రద్దీ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ 87 బస్సులను నడిపింది. దీంతో ప్రయాణికులు వారి వారి గమ్య స్థానాలకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా చేరుకున్నారు.
87బస్సులు ఏర్పాటు..
కార్మికుల సమ్మె చేపట్టి విధులకు హాజ రు కాకపోయిన ఆర్టీసీ మాత్రం తన సే వలను యథావిధిగా కొనసాగిస్తుం ది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 87 బస్సులను ఏర్పాటు చేసింది. అందులో ఆర్టీసీ ఆధ్వర్యంలో 60బస్సులను, హైర్ బస్సులను 20 ఏర్పాటు చేశారు. అలాగే స్కూల్ బ స్సు లు మంగళవా రం పునః ప్రా రంభమయ్యా యి. అలంపూర్ స్టేజీ నుంచి జోగుళాంబ ఆలయం వర కు 7 స్కూల్ బస్సులు ప్రయాణికులను చేరవేశాయి. సోమవారం జిల్లా వ్యాప్తం గా ఆర్టీసీ 71 బస్సులు నడపగా రూ. 3లక్షల 22 వేల ఆదాయం సమకూరిన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఆదాయం పెరుగుతుంది: డీఎం
రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచుతున్నామని ఆర్టీసీ డీఎం రాంమోహన్ తెలిపారు. అలాగే రోజు రోజుకు ఆర్టీసీ ఆదాయం పెరుతుండడం సంతోషించ దగ్గ విషయమన్నారు. గ్రామీణ ప్రాం తాలకు బస్సులను నడుపుతు న్నామన్నారు. అలాగే సూపర్ లగ్జరీ సర్వీసులను కూడా పునరుద్ధరించామని తెలిపారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న, అధికంగా చార్జీలు వసూ లు చేస్తున్న తన దృష్టికి తేవాలని సూ చించారు.

11వ రోజుకు చేరిన సమ్మె..
డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కా ర్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. సమ్మె లో భాగంగా కార్మికులు జిల్లా కేంద్రం గద్వాలలోని ప్రధాన రహదారుల గుం డా నిరసన ర్యాలీ నిర్వహించారు. అ నంతరం పాతబస్టాండ్‌లో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. కార్మికులకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, బీఎల్‌ఎఫ్, టీజేఎస్ తదితర రాజకీయ పార్టీ లు మద్దతును తెలిపాయి. అలాగే ఉపాధ్యాయ సంఘాలు, కుల, విద్యార్థి, ప్ర జా, కార్మిక సంఘాలు మద్దతును తెలిపాయి.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles