గొరిటలో రావేప్ విద్యార్థుల గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ

Wed,October 16, 2019 01:29 AM

తిమ్మాజిపేట : మండలంలోని గొరిటలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రావేప్ విద్యార్థినులు మంగళవారం గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ (పీఆర్‌ఏ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పటం, మాత్రిక, చపాతి డయాగ్రామ్ లాంటి పటాలు వేసి వాటిని విశ్లేషించారు. నేల, నీరు, వృక్ష జాతి, పశువులు మొదలగు వాటిని కొన్ని దశాబ్దాలుగా గ్రామంలో జరుగుతున్న మార్పులు, వ్యవసాయ పంటలు, యంత్రాల వాడకం మొదలగు వాటిని చిత్రాల ద్వారా గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామంలో వనరుల విశ్లేషణ, సాంఘీక ముఖచిత్రం, కాల పట్టిక, రుతుపవనాల కాలగమన పట్టిక, సంస్థలను విశ్లేషించారు. ఈ సందర్భంగా కేవీకే కోఆర్డినేటర్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సామాజిక, ఆర్థిక మొదలగు ప్రకృతి వనరులకు అనుగుణంగా పంటల రకాలు తక్కువ ఖర్చులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి వ్యవసాయంలో లాభం పొందవచ్చన్నారు. రైతులు విద్యార్థుల విశ్లేషణను అర్థం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం గ్రామంలో మహిళా రైతు రాముతలమ్మ పత్తి పంటను పరిశీలించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు రాజశేఖర్, మండల వ్యవసాయాధికారి కమల్‌కుమార్, సర్పంచ్ మురళీధర్‌రెడ్డి, ఏఈవో సాయి, రావేప్ విద్యార్థులు మాధవి, లిఖిత, మానస, నందిని, పల్లవి, గ్రామస్తులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల, దవాఖాన సేవలు బాగున్నాయ్..మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం): భారత వైద్య మండలి (ఎంసీఐ బృందం సభ్యులు) ఇటీవల రెండు రోజుల నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల జనరల్ దవాఖానాలో వసతులు, వైద్య సేవలపై నివేధికలు సేకరించి అన్ని సేవలు బాగున్నాయన్నారు. మంగళవారం ప్రభుత్వ జనరల్ దవాఖానాతోపాటు జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్, రామయ్యబౌలితోపాటు ఎదిర పీహెచ్‌సీలను మెడికల్ కళాశాల వైద్య అధికారులతో కలిసి ఎంసీఐ బృందం పరిశీలించారు. వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరానికి సంబంధించి సీట్ల మంజూరు కోసం అవసరమైన సౌకర్యాలను పరిశీలించారు. ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎంసీఐ అధికారులు జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలో ఉన్న వసతులను పరిశీలించేందుకు వెళ్లారు. దవాఖానాలోని ప్రతి వార్డును పరిశీలించారు. మార్చురీలో ఉన్న ఫ్రిజ్‌లను పరిశీలించారు. ఆయా విభాగాల వారీగా వివరాలను సేకరించారు. ఇక్కడ మెడికల్ కళాశాల, వైద్య కళాశాలలో రోగులకు, వైద్య విద్యార్థులకు అందిస్తున్న సేవలు, వసతుల నివేదికలను సేకరించి ఎంసీఐ అధికారులు వెళ్లారు. వారి వెంట మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్, దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్, ఎస్పీఎం డాక్టర్ కిరణ్‌ప్రకాశ్ ఉన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles