మద్యం దుకాణాలకు 74 దరఖాస్తులు

Wed,October 16, 2019 01:28 AM

సంవత్సరానికి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మంగళవారం జిల్లాలోని మద్యం దుకాణాలకు 74 దరఖాస్తులు అందినట్లు గద్వాల ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గోపాల్ తెలిపారు. వాటిలో గద్వాల ఎక్సైజ్ స్టేషన్‌లోని దుకాణాలకు-20, అలంపూర్ స్టేషన్‌లోని దుకాణాలకు-54 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటివరకు మొత్తం 146 దరఖాస్తులు రాగా వాటిలో గద్వాల పరిధిలో 46, అలంపూర్ పరిధిలో 100 దరఖాస్తులున్నాయన్నారు. ఆసక్తి గల టెండర్‌దారులు దరఖాస్తు చేసుకోడానికి చివరి గడవు నేటి (బుధవారం) సాయంత్రం 4 గంటల వరకు ఉందని గోపాల్ చెప్పారు.
మద్యం టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలిగద్వాల, నమస్తే తెలంగాణ: మద్యం దుకాణల టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ శశాంక ఎక్సైజ్‌శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల ఎక్సైజ్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలకు ఇంతవరకు వచ్చిన టెండర్ ఫారాలను ఆయన పరిశీలించారు. గద్వాల నియోజకవర్గంలోని 15 దుకాణాలకు 46, అలంపూర్ నియోజకవర్గంలో 8 దుకాణాలకు 100 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం దరఖాస్తులకు చివరి రోజు కాగా ఈ నెల 18వ తేదీన సీఎన్‌జీ ఫంక్షన్‌హాల్‌లో టెండర్ ఫారాలు పరిశీలించి దుకాణాల కేటాయింపు జరపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు, ఈఎస్ విజయభాస్కర్‌గౌడ్, సీఐలు గోపాల్, పటేల్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles