యూరియా కొరతలేదు

Wed,October 16, 2019 01:28 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సీజన్‌లో ముందస్తుగానే రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేస్తుందని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. మంగళవారం అలంపూర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ కేంద్రంలో ఏర్పాటుచేసిన విత్తన పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రైతులకు శనగ విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం శనగ విత్తనాలు 35 శాతం రాయితీపై పంపిణీ చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ఒక్కో మండలానికి 900 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తూందన్నారు. ప్రస్తుతం ఒక్కో మండలానికి 150 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, ఏవో అనిత, సీఈవో కేశవరెడ్డి, డైరెక్టర్లు నాగభూషణం, మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు జయరాముడు, హన్మంతరావు, వెంకట్రామయ్యశెట్టి, అల్లాబకాష్, దేవన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఉండవెల్లిలో.. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అమలవుతున్నదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో సబ్సిడీ ద్వారా పప్పుశనగ పంపిణీ కార్యక్రమంను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్రహం ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పప్పుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పప్పుశనగ క్వింటాళుకు రూ.4225 సబ్సిడీతో అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీసమ్మ, పీఏసీఎస్ చైర్మన్ మహేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో సుబ్బారెడ్డి, ఎంపీడీవో శివరాజ్, ఎంపీటీసీలు సుంకన్న, రాజు, పీఏసీఎస్ సీఈవో సలాంఖాన్ తదితరులు పాల్గొన్నారు.

వడ్డేపల్లిలో..
మండల కేంద్రంలోని శాంతినగర్‌లో వ్యవసాయ కార్యాలయం వద్ద మంగళవారం చేపట్టిన శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్రహం ముఖ్య అతిథిగా విచ్చేసి పంపిణీ చేశారు. రైతులకు పంపిణీ చేయడానికి 250 క్వింటాళ్ల శనగ విత్తనాలు, 720 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. శనగ విత్తనాలు స్థానిక ఆగ్రోస్ దుకాణంలో రైతులు తీసుకోవచ్చని ఏవో రాధ అన్నా రు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో రవీంద్ర, సహకార అధ్యక్షుడు పెద్దకుర్వ సోమన్న, రాజు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

అయిజలో..
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. మంగళవారం అయిజ పట్టణంలోని పీఏసీఎస్‌లో రైతులకు పప్పుశనగ విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగిలో సాగుచేసే పంటలకు సరిపడా ఎరువులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ ప్రహ్లాదరెడ్డి, ఏవో శంకర్‌లాల్, సీఈవో మల్లయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు నరసింహారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, నాగన్‌గౌడ్ పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles