అక్రమంగా తరలిస్తున్న

Tue,October 15, 2019 03:15 AM


-135 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మదనాపురం : అక్రమంగా తరలిస్తున్న 135 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం మదనాపురం మండల కేంద్రంలోని వ్యవ సాయ మార్కెట్ యార్డు సమీపంలో నిలిచి ఉన్న (ఏపీ22వై6868) నంబరు కలిగిన డీసీఎంను అనుమానాస్పదంగా గుర్తించి కానిష్టేబుల్ కుర్మయ్యతో కలిసి పోలీస్ స్టేషన్‌కు తరలించామని తెలిపారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వగా, సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తాసిల్దార్ వేణు వచ్చి బియ్యాన్ని పరిశీలించారన్నారు. అనంతరం శ్యాంపిల్స్‌ను జిల్లా కేంద్రంలోని ల్యాబుకు తీసుకెళ్లి పరీక్షించి పీడీఎస్ బియ్యంగా నిర్దారించారని తెలిపారు. డీసీఎంలో 135 క్వింటాళ్లు ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారని తెలిపారు. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నాడని, బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయం తెలియాల్సి ఉందన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles