గల్లంతైన మహిళ శవం లభ్యం

Tue,October 15, 2019 03:14 AM

పెబ్బేరు రూరల్ (శ్రీరంగాపురం) : జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువలో ఆదివారం గల్లంతైన మహిళ సోమవారం శవంగా లభ్యమైంది. శ్రీరంగాపురం మండలం కంభాళాపురం గ్రామానికి చెందిన జనుంపల్లి భారతి (40) అనే మహిళ ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. సమీపంలోని తమ వ్యవసాయ పొలంలో రసాయనిక ఎరువులు చల్లేందుకు వెళ్లిన ఆమె కాళ్లు చేతులు కడుక్కునేందుకు పక్కనే ఉన్న జూరాల కాలువకు వెళ్లి నీటిలో పడిపోయింది. వెంటనే గ్రామస్తులు కాలువలో ఎంత గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఘటనా స్థలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో శేరుపల్లి ప్రాంతంలో నీటిలో తేలియాడుతూ ఆమె శవం కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు శవాన్ని వెలికి తీశారు. పోలీసులు వనపర్తి ఏరియా దవాఖానకు శవపరీక్ష నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు శవాన్ని అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు శ్రీరంగాపురం ఎస్సై షేక్‌షఫీ తెలిపారు. కాగా మృతురాలి భర్త నాలుగేళ్ల కిందటనే అనారోగ్యంతో మరణించాడు. ఆమెకు కూతురు, కొడుకు ఉండగా, తన అత్తతో కలిసి జీవనం సాగిస్తోందని గ్రామస్తులు తెలిపారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles