గమ్య స్థానాలకు చేర్చాలి

Tue,October 15, 2019 03:14 AM

గద్వాల క్రైం : ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారి ప్రయాణించే బస్సుల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు ఆదేశించారు. గద్వాల ఆర్టీసీ డిపో, బస్టాండ్ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరుగకుండా ఏర్పాటు చేసిన భద్రత ను ఆమె సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎస్పీ మాట్లాడుతూ కండక్టర్లు, డ్రైవర్లు సమన్వయంతో వ్యవహరించి ప్రయాణిలకు భరోసా ఇచ్చేలా బస్సులను నడపాలన్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్కడైన ఇబ్బందికరమైన సం ఘటనలు చోటు చేసుకున్నా..జరిగే అవకాశం ఉన్న పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అవసరమైన చోట కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆమె పోలీసు అధికా రులను ఆదేశించారు. ఇన్‌చార్జి ఎస్పీ వెంట గద్వాల డీఎస్పీ షాకీర్‌హుస్సేన్, గద్వాల సీఐ జక్కుల హనుమంతులున్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles