జూరాలకు పెరిగిన వరద

Mon,October 14, 2019 03:01 AM

-8గేట్ల ద్వారా 59,948 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
-ఇన్‌ఫ్లో 98,000, అవుట్ ఫ్లో 1,07,030 క్యూసెక్కులు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జూరాలకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో 8గేట్లు ఎత్తి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం స్పిల్ వే ద్వారా నదిలోకి 59,948 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 98,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1,07,030 క్యూసెక్కులు నమోదైంది. పవర్‌హౌజ్ ద్వారా 43,747 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 6 టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1045అడుగుల ఎత్తులో 9.657టీఎంసీలుండగా ప్రస్తుతం 1044.9 అడుగుల ఎత్తులో 9.500 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 786 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 150క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు.

వీటితో పాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు భీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్‌లకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 55,241క్యూసెక్కులు కొనసాగుతుండటంతో అదే స్థాయిలో 55,241 క్యూసెక్కులతో నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు పూర్తి సామర్థ్యం 129.72టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాణయణఫుర ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 77,576క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 82,287 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల సామర్థ్యం ఉండగా అదే స్థాయిలో 37.12 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సుంకేసుల ఆరు గేట్ల ఎత్తివేత
రాజోళి: సుకేసుల బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. ఆదివారం ఎగువ ప్రాంతం నుంచి సుంకేసులకు 26,070 ఇన్‌ఫ్లో రాగా 23,253 ఔట్ ఫ్లో కొనసాగుతుంది. ఈ నీటి విడుదలకు అధికారులు 6 గేట్లను తెరచి నీటిని దిగువ ప్రాంతలోని శ్రీశైలంప్రాజెక్టుకు విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 2500 క్యూసెక్కులు నీటిని వదిలినట్టు ఏఈ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles