50 కిలోల క్యాట్‌ఫిష్‌ల పట్టివేత

Mon,October 14, 2019 02:59 AM

అయిజ రూరల్ : ఆదివారం అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామాల్లోని క్యాట్‌ఫిష్ పెంపకం చెరు వులపై మత్స్యశాఖ అధి కారులు, పోలీసులు దాడులు చేప ట్టారు. మండలంలోని చిన్న తాండ్రపాడు సమీ పంలోని క్యాట్‌ఫిష్ చెరు వులపై దాడులు జరిపి 50 కిలోల క్యాట్ ఫిష్‌ను స్వాధీనం చేసుకుని గోయ్యి తవ్వి పూడ్చిపెట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మిరెడ్డిలతో కలిసి చిన్నతాండ్రపాడు క్యాట్‌ఫిష్ చెరువులపై దాడులు చేశా మన్నారు. క్యాట్‌ఫిష్‌ను అంతర్వేది అనే వ్యక్తి క్యాట్‌ఫిష్‌ను పెంచుతున్నట్లు తమ విచారణలో తేలడంతో జిల్లా మత్స్యశా ఖ అధికారి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ దా డులలో పోలీసులు రాజశేఖర్, జయరాములు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles