వైద్యం వికటించి యువకుడి మృతి

Mon,October 14, 2019 02:58 AM

పెద్దకొత్తపల్లి: వైద్యం వికటించి యువకుడు చికిత్స పొం దుతూ మృతి చెందిన చోటు చేసుకుంది. డీఎస్పీ లక్ష్మినారా యణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బాచారం గ్రామానికి తాళ్ల బాలయ్య కుమారుడు సాయిబా బు (22) గత నెల 27నుంచి ఐదురోజుల పాటు మండలం లోని శ్రీ లైలీ దవాఖాన నిర్వాహకులు ఆర్‌ఎంపీ డాక్టర్ విష్ణుప్రతాప్‌రెడ్డి వద్దకు వెళ్లాడు. దీంతో ఆర్‌ఎంపీ డాక్టర్ విష్ణుప్రతాప్‌రెడ్డి సాయిబాబుకు వైద్యం చేస్తూ హైడోస్ మం దులు ఇవ్వడంతో పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్‌లోని పుల్లారెడ్డి దవాఖానకు తరలిం చారు. అక్కడ డాక్టర్ పరీక్షలు చేసి హైడోస్ మందులు వాడటంతో కిడ్నిలపై ప్రభావం పడిందని డాక్టర్ కుటుంబ సభ్యు లు తెలియజేయడంతో వారు హైదరాబాద్‌లోని ఓమిని ద వాఖానకు తరలించారు.

అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి కిడ్ని లు పాడయ్యాయని, యువకుడు ప్రమాదంలో ఉన్నాడని కుటుంబ సభ్యులకు తెలిజేశారు. దీంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున సాయిబాబు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు లైలీ దవాఖాన వద్ద సాయిబాబ మృత దేహంతో ధర్నా చేయడంతో సంఘటన స్థలానికి డీఎ స్పీ చేరుకొని ధర్నా చేస్తున్న కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడి ఆర్‌ఎంపీ డాక్టర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకొని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి తండ్రి బాల య్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.

స్థాయికి మించి ఆర్‌ఎంపీలు వైద్యం చేయరాదు
గ్రామాల్లో స్థాయికి మించి ఆర్‌ఎంపీ డాక్టర్లు వైద్యం చేయరాదని ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఎం సుధాకర్‌లాల్, డీఎస్పీ లక్ష్మినారాయణ, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటదాసు అన్నారు. గతంలో లైలీ దవాఖానపై కేసు నమోదు చేయడం జరిగిందని, ఎలాంటి అనుమతులు లేకుండా దొంగ చాటుగా స్థాయికి మించి హైడోస్ మందులు ఇవ్వడంతో యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. అతడిపై విచారణ చేసి కేసునమోదు చేస్తామనితెలిపారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles