ప్రయాణం.. ప్రశాంతం

Sun,October 13, 2019 12:12 AM

- యథావిధిగా బస్సుల కొనసాగింపు
- శుక్రవారం ఆర్టీసీ ఆదాయం రూ.2.86 లక్షలు
- జిల్లాలో కొనసాగతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎనిమిదో రోజైన శనివారం ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో జిల్లాలో బస్సులు 73 బస్సులను నడిపింది. 50 ఆర్టీసీ, 16 హైర్‌ బస్సులతోపాటు 7 స్కూల్‌ బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తం గా 87 బస్సులను నడపగా ఆర్టీసీకి 2.86లక్షల ఆదాయం సమకూరిందని సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు.

గద్వాలటౌన్‌ : జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం ఎనిమిదో రోజు కొనసాగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని అఖిలపక్ష నాయకులతో కలసి నిరసన చేపట్టారు. ఈ నేపథ్యం లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్య లు చేపట్టింది. ఎప్పటికప్ప డు స మస్యలను పరిష్కరిస్తూ ప్రయాణికుల అవసరాల మేరా బస్సులను నడుపుతున్నా రు. అందుకు గాను శనివారం జిల్లా వ్యాప్తంగా బస్సులను ఆర్టీసీ నడిపింది. రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పె రుగుతుండడంతో వారికి అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచుతూ ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూస్తున్నారు. కాగా శుక్రవారం గద్వాల డిపో నుంచి వివిధ ప్రాంతాలకు 87బస్సులను నడపగా రూ.2లక్షల 86 వేల ఆదాయం ఆర్టీసీ సమకూరినట్టు డిపో డీఎం తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 73 బస్సులు ఏర్పాటు ..
సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం ఆర్టీసీ ఆధ్వర్యంలో మొత్తం 73 బస్సులను ప్రయాణికులకు అం దుబాటులో ఉంచింది. అందులో ఆర్టీ సీ నుం చి 50 బస్సులు, 16హైర్‌ బస్సులు, 07స్కూల్‌ బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ, హైర్‌ బస్సులు జిల్లాలోని ధరూర్‌, గట్టు, మల్దకల్‌, అయిజ, అలంపూర్‌, రాజోలీ, శాంతినగర్‌, కేటీదొడ్డి, ఇటిక్యాల, ఉండవెల్లి తదితర మండలాలోని వివిధ గ్రామాలకు సేవ లు అం దించింది. అలాగే హైదరాబా ద్‌, క ర్నూల్‌, రాయచూర్‌, నారాయణపేట, వనపర్తి తదితర జిల్లాలకు కూడా బస్సులను నడిపారు. స్కూల్‌ బస్సుల సా యంతో అలంపూర్‌ స్టేజీ నుంచి జోగుళాంబ ఆలయాల వరకు భక్తులను, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశారు.

అధికంగా వసూలు చేస్తే చర్యలు: ఆర్టీసీ డీఎం
నిర్ణిత చార్జీల కంటే అధికంగా వసూళ్లు చేస్తే అట్టి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డీఎం రాంమోహన్‌ తెలిపారు. బస్సు పాస్‌లను, క్యాట్‌ కార్డులను అనుమంతించాలని తాత్కాలిక డ్రైవర్లకు, కండక్టర్లకు ఇది వరకే ఆదేశాలు జారీ చేశామని తెలిపరు. అ లాం టి ఇబ్బందులు ఏమన్న ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య తలె త్తలేదని మునుముందు కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుం డా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

కొనసాగతున్న కార్మికుల సమ్మె..
డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు అఖిల పక్ష పార్టీల నాయకులతో కలసి జిల్లా కేంద్రం గద్వాలలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాతబస్టాండ్‌లో బైఠాయించి మౌనదీక్ష చేపట్టా రు. నిరసనకు బీజేపీ, టీడీ పీ, కాంగ్‌స్‌,్ర బీఎల్‌ఎఫ్‌, టీజెఎస్‌, సీపీఐ పార్టీలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు వి ద్యార్థి, కుల సంఘాలు మద్దతు తెలిపా యి. డిమాండ్ల పరిష్కారం అయ్యే వర కు సమ్మె కొనసాగతుందని కార్మికులు చెప్పారు. అలాగే కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పూర్తి మ ద్దతు కార్మికులకు ఉంటుందని అఖిల పక్ష పార్టీల నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాక్‌ నాయకులు సు ధాకర్‌, ప్రసాద్‌, బీవీరెడ్డి, ఆర్‌ఎన్‌ఎస్‌ గౌడ్‌, ఉసేనప్ప, పరమేశ్వర్‌, ఆయా పా ర్టీల నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బం డల వెంకట్రాములు, రాజశేఖర్‌రెడ్డి, రాములు, రంజిత్‌కుమార్‌, పటే ల్‌ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles