జూరాలలో 5గేట్లు ఎత్తివేత

Sun,October 13, 2019 12:10 AM

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జూరాలకు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్ట్‌లో 5 గేట్లను ఎత్తి 41,386 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 83,000 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ ఫ్లో 89,712క్యూసెక్కులు నమోదైంది. పవర్‌హౌజ్‌ ద్వారా 44,264 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి 6 టర్బైన్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1045అడుగుల ఎత్తులో 9.657 టీఎంసీలుండగా ప్రస్తుతం 1044.9 అడుగుల ఎత్తులో 9.542 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 786 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 150క్యూసెక్కులు నీటిని అధికారులు కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. వీటితో పాటు నది నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్లకు నింపేందుకు భీమా లిఫ్ట్‌-1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్‌లకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 42,324 క్యూసెక్కులు కొనసాగుతుండటంతో అదే స్థాయిలో 42,324 క్యూసెక్కులతో నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా 128.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాణయణఫుర ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 66,381 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 69,498 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీల సామర్థ్యం ఉండగా అదే స్థాయిలో 37.64 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సుంకేసులకు పెరిగిన ఇన్‌ఫ్లో
రాజోళి: సుంకేసుల బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో శనివారం పెరిగింది. ఎగువ నుంచి 76,900 ఇన్‌ఫ్లో రాగా. 74,100 ఔట్‌ ఫ్లో కొనసాగింది. ఈ నీటి విడుదలకు అధికారులు 14 గేట్లను తెరిచి నీటిని శ్రీశైలం డ్యాంకు విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 1,050 క్యూసెక్కుల నీటిని వదిలినట్ల్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles