ప్లస్ట్రిక్ట్ చేద్దాం

Sat,September 14, 2019 01:21 AM

-కలెక్టర్ కే శాశంక
-ప్లాస్టిక్ వాడకంతోనేఅనేక రోగాలు
- కేటిదొడ్డి జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి

కేటీదొడ్డి : ఆరోగ్యానికి హానికరమైన ప్లాసిక్‌ను తరిమికొట్టి ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చుదిద్దుకుందామని కలెక్టర్ కే శాశంక సూచించారు. 30 రోజుల కార్యచరణలో భాగంగా ధరూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని మార్లబీడు, బురెడ్డిపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్లాస్టిక్ ఫ్రీ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిరాణషాపులు, హోటల్స్, చిరు వ్యాపారస్తులందరితో కలిసి కలెక్టర్ ప్లాస్టిక్‌ను ఎత్తివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంలో అనేక మార్పులు తీసుకొచ్చే ప్లాస్లిక్ కవర్స్‌ను, డిస్పోజల్ గ్లాసులను నిషేధించి స్వచ్ఛమైన వాతవరణంలో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుదామంటూ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కవర్లను అందరు నిషేధించాలన్నారు.

ఇకపై ఎవరైనా ప్లాస్టిక్ వాడకాన్ని కొనసాగిస్తే పర్యావరణాన్ని నాశనం చేసిన వాళ్లవుతారని అంతే కాకుండా ప్లాస్టిక్ వాడినవారికి జరిమాన విధిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతోనే అనేక రోగాలు వస్తున్నాయని దీనిని నివారించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నజ్మున్నీసాబేగం, సర్పంచ్ పద్మమ్మ, బురెడ్డిపల్లి సర్పంచ్ బండ్ల జ్యోతి, ఎంపీటీసీ దౌలన్న, ఎంపీడీవో జబ్బర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

క్రమం తప్పకుండా హాజరుకావాలి: కలెక్టర్
కేటీదొడ్డి (ధరూర్) : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ శశాంక తెలిపారు. ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లను, డిజిటల్ ప్రాజెక్ట్ క్లాస్ రూం, లైబ్రెరీతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. విద్యార్థుల సామార్థ్యాలను పరిశీలించిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్క నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నజ్మున్నీసాబేగం, మండల విద్యాధికారి సురేష్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles