కారు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

Sat,September 14, 2019 01:10 AM

జడ్చర్ల రూరల్ : జాతీయ రహదారి దాటుతున్న ద్విచక్ర వాహనదారుడిని కారు ఢీ కొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య(45) మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారి పక్కన ఉన్న సందర్శిని హోటల్ ముందు తన ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా హైదరబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కారు ఢీ కొనడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్తానికులు ఆ వ్యక్తిని ఆటోలో బాదేపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles