విద్యార్థులకు జిల్లా స్థాయి స్వచ్ఛత పక్వాడపై పోటీలు

Sat,September 14, 2019 01:09 AM

గద్వాల న్యూటౌన్ : గద్వాలలోని బాలభవన్‌లో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్వచ్ఛత పక్వాడలో భాగంగా వ్యాసరచన, చిత్రలేఖనం, గాంధీకి లేఖ అనే అంశాలపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించినట్టు సెక్టోరియల్ అధికారులు రామకృష్ణ, జగదీశ్వరయ్య తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశామన్నారు. పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అధికారులు బహుమతులు అందజేశారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles