మోటర్ వాహన చట్టం వెనక్కి తీసుకోవాలి

Sat,September 14, 2019 01:08 AM

గద్వాల అర్బన్ : మోటర్ వాహన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ మరియు ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ సభ్యుడు డీటీవో పురుషోత్తంరెడ్డిని కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీటీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భద్రత పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటర్ వాహన చట్టం ద్వారా కోట్లాది మంది స్వయం ఉపాధి పొందుతున్న రవాణా రంగ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం ప్రమాదాలను అరికడతాం, రవాణా రంగాన్ని అభివృద్ధి చేస్తామంటూ చట్టాన్ని తీసుకొచ్చిందని, బిల్లులో అలాంటి అంశాలు ఎక్కడా పేర్కొనలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, ఆంజనేయులు, బీచుపల్లి, వెంకటేశ్, రాజు, ఉప్పేర్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles