నీటి విడుదలకు వార బందీ

Sat,September 14, 2019 01:07 AM

గద్వాల,నమస్తేతెలంగాణ: పీజేపీ కుడి ఎడమ కాలువ పరిధిలో రైతులు సాగు చేసే పంటలకు వారబందీ పద్ధతి ద్వారా నవంబర్ నెల చివరి నుంచి నీటిని ఇవ్వడం జరుగుతుందని, రైతులు ఆరుతడి పంటలు ఎక్కువగా సాగు చేసుకోవాలని కలెక్టర్ శశాంక ఒక ప్రకటనలో రైతులను కోరారు. జూలై 30వ తేదీన కృష్ణానదికి వరద రావడం వల్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు పీజేపీ కుడి, ఎడమ కాలువ కింద లక్ష ఎకరాలకు నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నెట్టెంపాడ్ ఎత్తి పోతల పథకం కింద నీటి లభ్యతను బట్టి నీటిని లిఫ్ట్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడ్ రిజర్వాయర్‌లు నింపుకుని వానాకాలం 2019-2020 కు గాను లక్ష ఎకరాల ఆరుతడి పంటలకు కాలువల ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. తుంగభద్ర నది ప్రవాహం, తుం గభద్ర డ్యాం నీటి నిల్వలను బట్టి రాజోళి బండ మళ్లింపు పథకంకు డ్యాం ద్వారా, తుమ్మిళ్ల ఎత్తి పోతల పథకం ద్వారా 60వేల ఎకరాల ఆరుతడి పం టలకు 2019-20 వానాకాలం పంటలకు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకుని నీటి వృథాను అరికట్టాలని కలెక్టర్ రైతులకు సూచించారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles