స్వచ్ఛ పక్వాడా పోటీలో మేడికొండ విద్యార్థినుల ప్రతిభ

Sat,September 14, 2019 01:06 AM

అయిజ : స్వచ్ఛ పక్వాడా -2019 ఏడాది జిల్లా స్థాయి పోటీ పరీక్షలో మండలంలోని మేడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు వి ద్యార్థినులు రామేశ్వరి, శిరీషలు మొదటి, ద్వితీయ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయుడు కర్రెప్ప తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీ పరీక్షకు హాజరనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలో మేడికొండకు చెందిన రామేశ్వరి మొదటి, శిరీష ద్వితీయ స్థానంలో నిలువగా, జి ల్లా కేంద్రంలోని బాలభవన్‌లో విద్యార్థినులకు సెక్టోరియల్ అధికారి జగదీశ్వర్, నిర్వహకులు కృష్ణ, భాస్కర్, అనిత, భాను ప్రకాశ్‌ల చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 16న రా ష్ట్ర స్థాయి స్వచ్ఛ పక్వాడా -2019 పోటీలలో పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ పక్వాడా పోటీలో రాష్ట్ర స్థాయి పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం పట్ల హెచ్‌ఎం వీరన్న, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles