మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసిన ఉండవెల్లి మండల రైతులు

Sun,August 25, 2019 12:43 AM

ఉండవెల్లి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఉండవెల్లి మండల రైతులు శనివారం వనపర్తిలో కలిశారు. ఈ సందర్భంగా రైతులు మం త్రితో మాట్లాడుతూ గతకొన్నిరోజులుగా వర్షాలు సమృద్ధ్ధిగా కురువడం లేదని, దీంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు అందిస్తున్నప్పటికీ ఉండవెల్లి రైతుల భూములకు సాగునీరు అందడం లేదని మంత్రికి రైతులు వివరించారు. త్వరలో ఆర్డీఎస్ అధికారులతో మాట్లాడి సాగునీరు అందేవిధంగా చూస్తానని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి హామి ఇచ్చారు. మం త్రిని కలిసిన వారిలో ఎంపీటీసీ సుంకన్న, ఉండవెల్లి గ్రామపెద్దలు, రైతులు దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles