రంగనాథ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

Sun,August 25, 2019 12:42 AM

పెబ్బేరు రూరల్ (శ్రీరంగాపురం) : శ్రీరంగాపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీరంగనాధ స్వామి ఆలయంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పర్వదినం సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం రంగనాధస్వామికి అభిషేకంతో తులసి అర్చన నిర్వహించారు. రాత్రి తిరువీధి సేవతో పాటు ఉట్టి కొట్టే కార్యక్రమం జరిపారు. ఆలయ సముదాయంలోని గోదాదేవి గుడి వద్దనున్న మండపం వద్దకు భక్తులు చేరుకోగా, పురోహితుల వేదమంత్రాల మధ్య సంప్రదాయబద్దంగా నిర్వహించారు. కన్నుల పండుగగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles