భక్తులతో కిక్కిరిసిన కురుమూర్తి కొండలు

Sun,August 25, 2019 12:42 AM

చిన్నచింతకుంట : శ్రావణమాసం చివరి శనివారం కావడంతో ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు తండోపతండాలుగా కదిలి వచ్చి కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునుంచే స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేసి బారికెడ్లలో నిలిచారు. ఏడుకొండల వాసా గోవిందా గోవిందా అంటూ సప్తకొండల మధ్య వెలసిన వివిధ ఆలయాలను దర్శించుకుని ఉద్దాల మండపంలోని స్వామి పాదుకలను దర్శించుకున్నారు. కాంచనగుహలో వెలసిన కురుమూర్తి స్వా మికి ప్రత్యేక మొక్కలు తీర్చుకుని కొండ దిగువభాగంలో స్వామికి నైవేధ్యాలు తయారు చేసి స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కార్యనిర్వాహణా ధికారి శ్రీనివాసరాజు, ఆలయ సిబ్బంది ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles