తుంగభద్ర డ్యాంకు స్థిరంగా వరద

Sun,August 25, 2019 12:42 AM

అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద స్థిరంగా వస్తోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద నీరు తగ్గుతున్నది. దీంతో ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లను పూర్తిగా మూసివేశారు. శనివారం తుంగభద్ర జలాశయానికి 12,128 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 11,888 క్యూసెక్కులను కాల్వలకు విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 100.855 టీఎంసీలను నిల్వ ఉంచినట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ తెలిపారు. 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1633 అడుగుల పూర్తి స్థాయిలో నిల్వ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి విడుదల అవుతున్న వరద నీరు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నిలకడగా కొనసాగుతున్నది. శనివారం ఆర్డీఎస్ ఆనకట్టకు 15,419 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆనకట్టపై 1.4 అడుగుల మేర 20,840 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఈఈ రామయ్య తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి దిగువకు విడుదలవుతున్న వరద సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి ఆయకట్టుకు 610 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ డీఈఈ శ్రీనివాస్ తెలి పారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి విడుదల అవుతున్న నీరు తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలలోని ఆయకట్టుకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles