స్వల్పంగా వరద

Sun,August 25, 2019 12:41 AM

అయిజ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్వల్పంగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద క్రమేపీ తగ్గుతుండటంతో జూరాల స్పిల్‌వే గేట్లను అధికారులు మూసివేశారు. ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో స్వల్పంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 10 వేల వరకు ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రం 6 గంటలకు 6 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ప్రియదర్శిని జూరాలకు ఇన్‌ఫ్లో 6 వేల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 6,960 క్యూసెక్కులు కొసాగుతోంది. ఉదయం 6 గంటల వరకు పవర్ హౌస్ ద్వారా 7,605 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేశారు.

9.657 టీఎంసీల నీటి మట్టానికిగాను 9.480 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కుడి కాల్వకు 808, ఎడమ కాల్వకు 1,050 క్యూసెక్కులు, సమాంతర కాల్వ ద్వారా 850 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా 2,250, బీమా లిప్టు-1 ద్వారా 1300, బీమా లిప్టు -2 ద్వారా 750, కోయిల్‌సాగర్ లిప్టుకు 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 17,491, అవుట్‌ఫ్లో 17,491 క్యూసెక్కులుగా నమోదైంది. 129.72 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 128.19 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపుర ప్రాజెక్టుకు 21,750 ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 10,478 క్యూసెక్కులు నమోదైంది, 37.64 టీఎంసీల సామర్థ్యం కలిగిన నారాయణపురలో ప్రస్తుతం 35.38 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles